మచ్చలేని మంత్రి ఈటలకు అన్యాయం

ABN , First Publish Date - 2021-05-03T04:34:50+05:30 IST

మచ్చలేని మంత్రి ఈటలకు అన్యాయం

మచ్చలేని మంత్రి ఈటలకు అన్యాయం
కొడంగల్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

  • పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు 


పరిగి/కులకచర్ల/దోమ: మంత్రి ఈటల రాజేందర్‌ను ఆరోగ్య శాఖ నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మచ్చలేని మంత్రి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్‌ కక్షగట్టి ప్లాన్‌ప్రకారమే ఆయనను తొలగించారని ఆరోపించారు. పరిగిలో టీజేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.హన్మంత్‌ముదిరాజ్‌, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాల్‌కృష్ణ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  సీఎం కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు, ఇతర మంత్రుల ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి రాచంద్రయ్య, ఎల్‌హెచ్‌పీఎ్‌స జిల్లా అధ్యక్షుడు గోవింద్‌నాయక్‌, అడ్వకేట్స్‌ జేఏసీ కన్వీనర్‌ ఆనంద్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ మాణిక్యం, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, నాయకులు మల్లేశ్‌, శ్రీనునాయక్‌, తావుర్యానాయక్‌, యాదయ్య, శివకుమార్‌, నజీర్‌లు పాల్గొన్నారు. కులకచర్లలో మండల ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో చౌరస్తాలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. ఈటలకు రాష్ట్రంలోని ముదిరాజ్‌లంతా మద్దతుగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం నాయకులు మైపాల్‌, చంద్రలింగం, రామక్రిష్ణ, రమేశ్‌, నర్సింహులు, వెంకటయ్య, పెంటయ్య పాల్గొన్నారు. దోమలో ముదిరాజ్‌ సంఘం మండల అధ్యక్షుడు మేకల యాదయ్య, మోత్కూరు సర్పంచ్‌ కేశవులు, ఆనంద్‌ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ ఈటలకు అండగా నిలబడి కేసీఆర్‌కు గుణపాఠం చెప్తామన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ నాయకులు ఎం.నర్సింహులు, రాజు, సిద్దయ్య, రాము పాల్గొన్నారు.

ఈటలపై కుట్రపూరిత ఆరోపణలు సరికాదు 

కొడంగల్‌/కొడంగల్‌రూరల్‌/బొంరాస్‌పేట్‌/దౌల్తాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్‌పై కుట్ర పూరిత ఆరోపణలకు పాల్పడటం సరికాదని ముదిరాజ్‌ సంఘం, కుల సంఘాలు, అఖిల పక్షం నాయకులు అన్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక ఐబీలో విలేకరులతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే ఈటల రాజేందర్‌ను అవమానానికి గురిచేస్తున్నారని తెలిపారు. అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు పేదల భూములను లాక్కొని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాలు కొనసాగిస్తున్నా పట్టించుకోని కేసీఆర్‌ మంత్రి ఈటలను తొలగించడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, బాల్‌రాజ్‌, తిరుపతయ్య, నారాయణ, బాబయ్యనాయుడు, బాలయ్య, శ్యామప్ప, సత్యపాల్‌, రమేశ్‌, నర్సిములు, వెంకటయ్య, పల్లెర్లరాములు, బాల్‌రాజ్‌, బస్వరాజ్‌యాదవ్‌, ముదిరాజ్‌ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. బొంరా్‌సపేట్‌లో ముదిరాజ్‌ సంఘం మండల నాయకులు తిరుపతయ్య మాట్లాడుతూ  కరోనా కష్ట కాలంలో ప్రజలకు సేవలు చేస్తున్న మంత్రిని తొలగించడం కేసీఆర్‌ నియంతృత్వ ధోరణికి అద్ధం పడుతుందన్నారు. ఈటలకు పెరుగుతున్న ప్రజాదరణను ఓర్వలేక కేసీఆర్‌ కుటుంబం ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో బాబయ్యనాయుడు, క్రిష్ణ; అనంతయ్య, రాచందర్‌, రాములు, నర్సిములు, అంజిలయ్య, రాములు, నరేశ్‌, నర్సిములు తదితరులు పాల్గొన్నారు. 

మీవెంట మేముంటాం..

ఘట్‌కేసర్‌ రూరల్‌: ఎదులాబాద్‌ ముదిరాజ్‌ సంఘం నాయకులు ఆదివారం మంత్రి ఈటల రాజేందర్‌ను నగరంలోని ఆయన నివాసంలో కలిసి మీ వెంట మేముంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈటల గజం భూమిని కూడా కబ్జా చేయలేదని, కావాలనే సీఎం కేసీఆర్‌ భూవివాదంలో ఇరికించారని ఆరోపించారు. పథకం ప్రకారమే ఈటలను భూవివాదంలోకి నెట్టి మంత్రిపదవి నుంచి బర్తరఫ్‌ చేశారని అన్నారు. అంతకుముందు ఎదులాబాద్‌ ముదిరాజ్‌ సంఘం ఎదుట ఆందోళన నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం నాయకులు వెంకటనారాయణ, జవ్వాజీ లింగంముదిరాజ్‌, జవ్వాజీ గణేష్‌, బాలరత్నం, మల్లేష్‌, రవి, రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-03T04:34:50+05:30 IST