స్వాతంత్య్ర దినోత్సవాన్ని సమన్వయంతో నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-08-10T04:07:05+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని సమన్వయంతో నిర్వహించాలి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని సమన్వయంతో నిర్వహించాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి

అదనపు కలెక్టర్‌ సమీక్ష

ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి: ఈనెల 15న  స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధికారులు సమన్వయంతో నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో ఇద్దరు అదనపు కలెక్టర్లు సమీక్ష నిర్వహించారు. వేడుకకు వచ్చే అతిఽథులకు లోటుపాట్లు రాకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. వివిధ శాఖలు తమ పనులను ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. వేదిక, బారికేడ్లు, కలెక్టరేట్‌ అలంకరణ పనులను  ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో లోకల్‌ బాడీస్‌ అదనపు కలెక్టర్‌  శ్యాంసన్‌, డీఆర్వో లింగ్యానాయక్‌, ఏవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పిల్లలకు నిమోనియా వ్యాక్సిన్‌ను వేయించాలి

చిన్న పిల్లల్లో నిమోనియా రాకుండా న్యూమోకోకల్‌ కాంజువేట్‌ వ్యాక్సిన్‌ వేయించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌ జిల్లా వైద్య అధికారులకు, సిబ్బందికి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో  జిల్లా వైద్యాధికారులతో మాట్లాడారు. ఈ నెల 12 నుంచి  చిన్నారులకు  పీసీవీ టీకాలను వేయాలన్నారు. టీకా ఆరు వారాల వయసులో మొదటి డోసు, 14 వారాల్లో రెండో డోసు, తొమ్మిదో నెలలో బూస్టర్‌ వ్యాక్సిన్‌ వేయించాలన్నారు. సమావేశంలో ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ పల్లవి, డిప్యుటీ డీఎంహెచ్‌వో అనంద్‌, డాక్టర్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-10T04:07:05+05:30 IST