ప్రజాభీష్టం మేరకే పథకాల అమలు

ABN , First Publish Date - 2021-05-31T05:10:02+05:30 IST

ప్రజాభీష్టం మేరకే పథకాల అమలు

ప్రజాభీష్టం మేరకే పథకాల అమలు
సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తున్న పత్యనాయక్‌

ఆమనగల్లు: ప్రజల అభీష్టానికనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు రూపొందించి అమలు చేస్తుందని టీఆర్‌ఎ్‌స్‌ జిల్లా నాయకుడు నెనావత్‌ పత్యనాయక్‌ అన్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలిస్తూ అభివృద్ధికి బీజం వేస్తున్నాయని పేర్కొన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ  3వ వార్డు సాకిబండ తండాలో రూ.25లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. పనులు నాణ్యతగా, త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. గ్రామాలు, తండాలకు బీటీ రోడ్లు నిర్మించి రవాణ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాకే గ్రామాలు, తండాల్లో ప్రజలకు వసతులు కల్పించారన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్‌నాయక్‌, విష్ణు, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-31T05:10:02+05:30 IST