అక్రమ లే అవుట్‌ తొలగింపు

ABN , First Publish Date - 2021-11-27T05:20:38+05:30 IST

అక్రమ లే అవుట్‌ తొలగింపు

అక్రమ లే అవుట్‌ తొలగింపు
పర్వతాపూర్‌లో లే అవుట్‌లోని హద్దురాళ్లను తొలగిస్తున్న సిబ్బంది

తాండూరు రూరల్‌: పర్వతాపూర్‌లో అనుమతులు లేకుండా చేసిన లే ఔట్లను మండల పంచాయతీ అధికారి రతన్‌సింగ్‌, కార్యదర్శి ఆధ్వర్యంలో కూల్చివేశారు. శుక్రవారం ఎంపీవో రికార్డుల తనిఖీకి వెళ్లారు. అనుమతి లేకుండా లే అవుట్‌ చేసి ప్లాట్ల విక్రయానికి పెట్టారని అధికారి దృష్టికి వచ్చింది. వెంటనే పంచాయతీ సిబ్బందిని పిలిపించి అధికారుల సమక్షంలో ప్లాట్లలో హద్దు రాళ్లు తొలగించారు. ఈ భూమి గ్రామ కంఠానిదని కొందరు గ్రామస్తులు ఎంపీడీవోకు సమాచారం ఇచ్చినా వచ్చి చూడలేదని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అదే భూమిలో ప్లాట్లు విక్రయాలకు పెట్టగా ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్‌ లాల్‌రెడ్డిని వివరణ కోరగా ఆ భూమి గురించి తనకు ఏమీ తెలి యదని అన్నాడు. పట్టా భూమి అని ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టినట్లు చెబుతున్నారని సర్పంచ్‌ తెలిపారు. ఈ భూమిపై అధికారులు సర్వేచేసి ప్రభుత్వ భూమిని కాపాడి ప్రజలకు కావాల్సిన భవనాలను నిర్మించాలని గ్రామస్తులు అధికారులను కోరారు.

Updated Date - 2021-11-27T05:20:38+05:30 IST