ప్రజాసమస్యల పరిష్కారానికే ‘మీతో నేను’

ABN , First Publish Date - 2021-12-16T05:04:28+05:30 IST

ప్రజాసమస్యల పరిష్కారానికే ‘మీతో నేను’

ప్రజాసమస్యల పరిష్కారానికే ‘మీతో నేను’
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌

మర్పల్లి : ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకే మీతో నేను కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని గుండ్లమర్పల్లి, పిల్లిగుండ్ల గ్రామాలలోని ముఖ్య వీధుల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పిల్లిగుండ్ల గ్రామంలో తాగునీరు, విద్యుత్‌ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని గ్రామస్తులు అడిగి తెలుసుకున్నారు. పిల్లిగుండ్ల, గుండ్ల మర్పల్లి గ్రామాలలో అండర్‌ డ్రైనేజీ సమస్యలు అధికంగా ఉందని, పంచాయతీలో నిధులు లేక పనులు చేయలేకపోతున్నామని ఆయా గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా గుండ్లమర్పల్లికి రూ.4లక్షలు, పిల్లిగుండ్లకు రూ.4లక్షలను ఎమ్మెల్యే నిధుల నుంచి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్‌, వైస్‌ఎంపీపీ మోహన్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేష్‌, రైతుబంధు మండలాధ్యక్షుడు నాయబ్‌గౌడ్‌, నాయకులు ప్రభాకర్‌గుప్త, రామేశ్వర్‌, శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T05:04:28+05:30 IST