పరిశుభ్రత.. అందరి బాధ్యత
ABN , First Publish Date - 2021-12-16T05:10:51+05:30 IST
పరిశుభ్రత.. అందరి బాధ్యత

మేడ్చల్ : పట్టణ పరిశుభ్రత ప్రతిత ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి, కమిషనర్ లావణ్యలు పేర్కొన్నారు. బుధవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 12, 13 వార్డుల్లో పర్యటించి స్వచ్ఛసర్వేక్షన్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ గుండ్లపోచంపల్లిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తడి, పొడిచెత్త సేకరణకు సహకరించాలన్నారు. వైస్‌చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్ మల్లిఖార్జున్ తదితరులున్నారు.
పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి
తాండూరు రూరల్ : మండల పరిధిలోని ఆయా గ్రామపంచాయతీల్లో పరిసరాల పరిశుభ్రతపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు మండల ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, పంచాయతీ అధికారి రతన్‌సింగ్‌లు పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నర్సరీలు, కంపోస్ట్ షెడ్లు, క్రిమిటోరియం, పరిసరాల పరిశుభ్రత, వాటర్ ట్యాంకు క్లీనింగ్ వంటి పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌సైతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీవో నరోత్తంరెడ్డి, ఈసీ మధుసూదన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఆనంద్‌రావు, విశ్వనాథం, లాలప్ప, బాలరంగాచారి, సునీత, తదితరులు పాల్గొన్నారు.