కవులకు సన్మానం

ABN , First Publish Date - 2021-04-04T05:02:51+05:30 IST

కవులకు సన్మానం

కవులకు సన్మానం
కవులను సన్మానిస్తున్న ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): ఎందరో స్వాతంత్ర సమర యోధుల ఫలితంగా స్వేచ్చా వాయువులను పీలుస్తున్నామని ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు అన్నారు. 75వ భారత స్వాతంత్ర వేడుకల సందర్భంగా జిల్లాలో స్వాతంత్ర భారత అమృత మహోత్సవంలో భాగంగా శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్వాతంత్ర స్ఫూర్తి అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కవులను సన్మానించారు. పారితోషికంతో  పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయకుమారి, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పద్మశ్రీ, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరరావు, కవులు పి.శ్యామచారి,  చిమ్మపూడి శ్రీరామమూర్తి, జి.కృష్ణగౌడ్‌, గౌండ్ల వీరమణి, ఆకుల మల్లికార్జున్‌, భవాని జగదీశ్వర్‌రెడ్డి, ఘనపురం పరమేశ్వర, కె.మల్లేష్‌, బుయ్యంకార్‌ జహంగీర్‌, డాక్టర్‌ జొన్నవడ రామస్వామి, టి.ఆశీర్వాదం, పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-04T05:02:51+05:30 IST