మేడ్చల్‌ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2021-12-16T04:53:25+05:30 IST

మేడ్చల్‌ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే

మేడ్చల్‌ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే

మేడ్చల్‌: మేడ్చల్‌ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఐటీఐ తరలింపును అడ్డుకోవాలని కోరుతూ ఇటీవల 132 మంది విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మకు లేఖ రాశారు. ఐటీఐని అక్కడి నుంచి దూరంగా తరలించి ఆ భూమిని ఇతర ప్రయోజనాలకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని, ఐటీఐని దూరంగా తరలిస్తే విద్యార్థులు ప్రయాణానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు స్థానిక పరిశ్రమల్లో పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్నారని తెలిపారు. విద్యార్థుల లేఖను సుమోటోను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన సీజే ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఐటీఐని తరలిస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బంది పడతారని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రయాణ ఛార్జీలు భరించలేరని, పార్ట్‌టైం ఉద్యోగాలు కూడా కోల్పోతారని పేర్కొంది. పూర్తి వివరాలతో 8 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తరలింపు ప్రక్రియను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 29కి వాయిదా వేసింది.

Updated Date - 2021-12-16T04:53:25+05:30 IST