ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2021-09-04T04:16:12+05:30 IST
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బంగారం పట్టుబడింది.

శంషాబాద్ రూరల్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బంగారం పట్టుబడింది. శుక్రవారం తెల్లవారుజామున షార్జా నుంచి జీ9-458 విమానంలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ప్రయాణికుడు మహ్మద్ రఫీక్ బ్యాగులను తనిఖీ చేయగా కేజీ బంగారం లభ్యమైంది. దీని విలువ రూ.43లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.