ధ్యానంతో ఆరోగ్య సమాజం

ABN , First Publish Date - 2021-12-31T04:47:15+05:30 IST

ఆరోగ్య సమాజ నిర్మాణానికి ధ్యానమే గొప్ప

ధ్యానంతో ఆరోగ్య సమాజం
వేణునాథ ధ్యానంలో సుభాష్‌ పత్రీజీ

  • ప్రపంచ ధ్యాన గురువు బ్రహ్మర్షి సుభాష్‌ పత్రీజీ 


ఆమనగల్లు : ఆరోగ్య సమాజ నిర్మాణానికి ధ్యానమే గొప్ప మార్గమని ప్రపంచ ధ్యాన గురువు, పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్‌పత్రీజీ అన్నారు. శరీరం, మనసును శుద్ధిచేసే దివ్యసాధనం ధ్యానమని చెప్పారు. కడ్తాల మండలం కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌లో ధ్యాన మహోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహిళా ధ్యాన మహాచక్రం-3లో భాగంగా 10వరోజు గురువారం పత్రీజీ వేణునాథ ధ్యానంతో సభలు ప్రారంభమ య్యాయి. ఈసంద ర్భంగా పలు ధ్యాన, ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం పత్రీజీ మాట్లాడుతూ ధ్యాన సాధకులే సమాజంలో ఆరోగ్య, అదృష్ట, ఐశ్వర్యవంతులన్నారు. ధ్యానం ద్వారా ఆత్మలో ఉన్న శక్తి బయటకు వస్తుందని, తద్వారా సంకల్పబలం సిద్ధించి వ్యక్తి విజయా నికి దోహద పడుతుందన్నారు. జన్మతో మాన వులందరూ జ్యోతి స్వరూపులేనని, తప్పులను సరిదిద్దుకొని సన్మార్గంలో నడవడం ద్వారా ఉన్నతులవుతారన్నారు. సాత్విక ఆహారం సం పూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుందన్నారు. గురు సాంఘత్యం, పీఎంసీ ఛానల్‌లో 300ల ఎపిసోడ్‌లు పూర్తిచేసిన సంద ర్భంగా ప్రోగ్రామ్‌ నిర్వాహకుడు మారేళ్ల రవిశాస్ర్తిని పత్రీజీ, స్వర్ణ మాల పత్రీజీ సత్కరించి అభి నందించారు. 11 రోజులపాటు కొన సాగిన ధ్యాన మహోత్సవ వేడుకలు శుక్రవారం ముగియను న్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌, పిరమిడ్‌ ట్రస్టీ వైస్‌చైర్మన్‌ కోర్పోలు విజయ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-31T04:47:15+05:30 IST