రూ.50వేల విలువచేసే గుట్కా పట్టివేత

ABN , First Publish Date - 2021-08-20T05:41:30+05:30 IST

రూ.50వేల విలువచేసే గుట్కా పట్టివేత

రూ.50వేల విలువచేసే గుట్కా పట్టివేత

ఘట్‌కేసర్‌ రూరల్‌: గుట్కా స్థావరంపై గురువారం రాత్రి ఎస్వోటీ పోలీసులు, సివిల్‌ పోలీసులు దాడులు చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఎన్‌.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం సమస్తపూర్‌ జిల్లాకు చెందిన బీరేందర్‌ మండల్‌(27) యంనంపేట్‌ చౌరస్తాలోని శంకర్‌దేవ్‌ కాం ప్లెక్స్‌లోని మొదటి అంతస్తులో అద్దెకుంటున్నాడు. గదిలో గుట్కాలను నిల్వ చేసి అమ్ముతున్నాడు. పోలీసులు దాడి చేసి రూ.50వేల విలువ చేసే గుట్కాలతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని బీరేందర్‌ను అదుపులోకి తీసుకోన్నారు.

Updated Date - 2021-08-20T05:41:30+05:30 IST