హామీలేమయ్యాయి!

ABN , First Publish Date - 2021-10-24T04:18:52+05:30 IST

హామీలేమయ్యాయి!

హామీలేమయ్యాయి!
రషీద్‌గూడలో షర్మిల పాదయాత్ర

  • తెలంగాణ వచ్చినా నిరుద్యోగ యువతకు నిరాశే..
  • కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైంది? 
  • 11 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్‌ఆర్‌దే..
  • కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తేనే అభివృద్ధి
  • ప్రజాప్రస్థానం పాదయాత్రలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

  • వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైస్‌ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 4వ రోజు శనివారం విజయవంతంగా కొనసాగింది. శంషాబాద్‌ మండలంలోని గొల్లపల్లిలో మొదలై మహేశ్వరం మండలం నాగారం వరకు  కొనసాగింది.  పాదయాత్రల్లో ఆమె పలు చోట్ల రైతులు, కూలీలు, యువకులు,మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పెద్దగోల్కొండలో మాట- ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. 

శంషాబాద్‌రూరల్‌/ఇబ్రహీంపట్నం/మహేశ్వరం: విద్యార్ధులు, ఉద్యమకారుల ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చిన తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాప్రస్ధానం పాదయాత్రలో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పెద్దగోల్కొండలో ప్రజలతో మాటముచ్చట నిర్వహించారు. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయని ఆశపడిన నిరుద్యోగ యువతకు నిరాశే మిగిలిందన్నారు. కేజీ టూ పీజీ ఉచిత  విద్య హామీ ఏమైందని మండిపడ్డారు. ఉద్యోగ నోటీఫికేషన్ల కోసం యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో లక్ష ఉద్యోగాలతో పాటు జంబో డీఎస్సీ ద్వారా  58 వేల మందికి టీచర్‌ ఉద్యోగాలు వీటితో పాటు ప్రైవేట్‌ రంగంలో 11 లక్షల మందికి ఉద్యోగాలు, వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు, 46 లక్షల మందికి ఇందిర్మ ఇళ్లు స్ధలాలు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కానీ కేసీఆర్‌ కనీసం లక్ష ఉద్యోగాలు, గ్రామాల్లో పది మందికి కూడా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదన్నారు. నిత్యావసరాల వస్తువులు, పెట్రోల్‌ ధరలు పెరుగుదలతో సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు రెండు సార్లు అఽధికారమిస్తే ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యాబట్టారు. కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని ఆరోపించారు. వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీకి అధికారం ఇస్తే రాజన్న పాలన అందిస్తానని భరోసానిచ్చారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. భూ సమస్యల పరిష్కారంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర నాయకులు రాఘవరెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T04:18:52+05:30 IST