హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతి

ABN , First Publish Date - 2021-04-09T05:17:48+05:30 IST

హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతి

హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతి
మోమిన్‌పేట-శంకర్‌పల్లి మార్గంలో మంటల్లో కాలిపోతున్న మొక్కలు

  • గ్యాస్‌లైన్‌ నేపథ్యంతో నేలకొరిగిన మరికొన్ని మొక్కలు

మోమిన్‌పేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రోడ్డుకి ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటినప్పటికీ కొందరు రైతులు, బాటసారుల తప్పిదంతో మొక్కలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో ప్రభుత్వలక్ష్యం నెరవేరకపోవడంతో పాటు ప్రజాధనం వృథా అవుతోంది. మొక్కల చుట్టూ ముళ్లకంపలు, గడ్డి తొలగించకపోవడంతో రైతులు పొలాల్లోని చెత్తాచెదారం, ముళ్ల కంపలు తగులబెట్టే క్రమంలో, పాదచారులు వేసే నిప్పులకు మంటలు చెలరేగి మొక్కలు దగ్ధమవుతున్నాయి.  గురువారం మోమిన్‌పేట నుంచి శంకర్‌పల్లి వెళ్లే మార్గంలో ఎన్కతల సమీపాన గడ్డికి నిప్పంటుకోవడంతో వరుసగా అగ్ని రాజుకుంటూ హరితహారం మొక్కలకు అంటుకుని చాలా మొక్కలు కాలిపోయాయి. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. అదేవిధంగా మండలంలోని మేకవనంపల్లి నుంచి ఎన్కతల వరకు వేస్తున్న గ్యాస్‌ పైప్‌లైన్‌ నిర్వహణలో వందలాది మొక్కలు నేలకొరిగించారు. ఇందులో తమ అవసరాలకు వాడిన సిమెంట్‌ బ్యాగ్‌లను రోడ్లకు ఇరువైపులా ఇష్టానుసారంగా పారవేస్తున్నారు. వీటిని పశువులు, మేకలు నమిలి మింగితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు దిగులుచెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిగిలిన మొక్కలకైనా రక్షణ కల్పించాలని, వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గ్రామస్థులు కోరుతున్నారు.


Updated Date - 2021-04-09T05:17:48+05:30 IST