రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు

ABN , First Publish Date - 2021-05-08T05:30:00+05:30 IST

రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు

రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు

పూడూరు: పూడూరు మండల వ్యవసాయ సహకార సంఘం, మన్నెగూడ, చన్‌గోముల్‌ ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలలో పచ్చిరొట్టవిత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఏవో సామ్రాట్‌రెడ్డి తెలిపారు. పచ్చిరొట్టే విత్తనాలు అవసరమున్న రైతులు సోమవారం పట్టదారు పాసుబుక్‌లు, ఆధార్‌కార్డులతో వ్యవసాయ కార్యాలయంకు వచ్చి పర్మిట్‌ పొందాలని సూచించారు. పచ్చిరొట్టే విత్తనాలు సబ్సిడీపై జనుములు 40 కేజీల బస్తా రూ.930, జీలుగు ఒక బస్తా రూ.562లకు లభిస్తుందని ఏవో తెలిపారు. అవసరమున్న రైతులు వ్యవసాయ కార్యాలయంలో పర్మిట్‌ పొంది సబ్సిడీపై పొందవచ్చన్నారు.

Updated Date - 2021-05-08T05:30:00+05:30 IST