పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేయండి
ABN , First Publish Date - 2021-11-21T05:52:49+05:30 IST
పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేయండి

ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఉప్పరిగూడ సర్పంచ్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి మంత్రి సబితారెడ్డికి శనివారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల శిథిలావస్థకు చేరిందని, నూతన భవన నిర్మాణానికి రూ.75లక్షలు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి వెంటనే కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు సర్పంచ్ తెలిపారు.