ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

ABN , First Publish Date - 2021-05-19T05:04:24+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ సురేష్‌

దోమ: దోమ మండల పరిధిలోని దాదాపూర్‌ గ్రామంలో డీసీఎమ్మెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ సురేష్‌ మంగళవారం పరిశీలించారు. రైతులు తెచ్చే ధాన్యంలో తేమశాతం ఉండేలా చూడాలని, తూకాల్లో మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

తాండూరురూరల్‌: అంతారంలో గ్రామంలో మంగళవారం ఎల్మకన్నె సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సర్పంచ్‌ రాములు, ఎంపీటీసీశాంత్‌కుమార్‌, డైరెక్టర్‌ నర్సింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రభుత్వం గ్రామాల్లో వరి కొనుగోళ్లు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధి గంగాధర్‌, బాబర్‌, రాజు పటేల్‌, ఎల్లప్ప, రజనికాంత్‌, సుబ్బారెడ్డి, శామెల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-19T05:04:24+05:30 IST