లారీ ఢీకొని ప్రభుత్వ టీచర్‌ దుర్మరణం

ABN , First Publish Date - 2021-02-07T05:04:00+05:30 IST

లారీ ఢీకొని ప్రభుత్వ టీచర్‌ దుర్మరణం

లారీ ఢీకొని ప్రభుత్వ టీచర్‌ దుర్మరణం

తాండూరు రూరల్‌: విధులు ముగించుకుని బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘట న తాండూరు మండలం గౌతాపూర్‌-చించొళి రోడ్డు మార్గంలోని అల్లాపూర్‌ సమీపంలో చోటుచేసుకుంది. కరన్‌కోట్‌ ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూ రులోని ఇందిరానగర్‌కు చెందిన గుండప్ప(28) మండలంలోని జినుగుర్తితండాలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. సాయంత్రం విధులు ముగించుకుని తన బైక్‌పై తాండూరుకు వస్తుండగా అల్లాపూర్‌, గౌతాపూర్‌ గ్రామాల మధ్య ఎదురుగా వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో గుండప్ప తీవ్రగా యాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్‌ అనంతపురం అంజి అలియాజ్‌ అంజిలప్ప అతివేగంగా లారీని నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు అటుగా వెళ్తున్న వాహనదారులు తెలిపారు. మృతుడి భార్య మిల్కా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు గుండప్ప జినుగుర్తి ప్రాథమిక పాఠశాలలో 2012నుంచి జినుగుర్తి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. గుండప్ప మృతికి ఎంఈవో వెంకటయ్య సంతాపం తెలిపారు.


Updated Date - 2021-02-07T05:04:00+05:30 IST