ఈ బడికి పోయేదెట్టా?

ABN , First Publish Date - 2021-08-28T04:16:22+05:30 IST

మరో మూడు రోజుల్లో బడులు తెరుచుకోనున్నాయి.

ఈ బడికి పోయేదెట్టా?
కుర్మిద్ద ఉన్నత పాఠశాలలో మోకాలు లోతు పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలు

మరో మూడు రోజుల్లో బడులు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో పారిశుధ్యంతోపాటు మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ యాచారం మండలం కుర్మిద్ద ఉన్నత పాఠశాలలో  ఇప్పటివరకు అలాంటివేమీ కనిపించడం లేదు. బడి ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి భయానకంగా ఉంది. మోకాలు లోతు గడ్డి మొలవడంతో మూత్రశాల, మరుగుదొడ్లకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఆ అగాదంలో ఏ విషసర్పం దాగి ఉందో తెలియని పరిస్థితి. ఇలా అధ్వానంగా ఉన్న బడికి విద్యార్థులు ఎలా వెళ్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. - యాచారంUpdated Date - 2021-08-28T04:16:22+05:30 IST