పేదల వైద్యానికి అండగా ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST

పేదల వైద్యానికి అండగా ప్రభుత్వం

పేదల వైద్యానికి అండగా ప్రభుత్వం
ఎల్‌వోసీ అందజేస్తున్న ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి

పరిగి(రూరల్‌): పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిఽధులు మంజూరు చేస్తూ అండగా నిలుస్తోందని పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి అన్నారు. సోమవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని  మదారం గ్రామానికి చెందిన యాదిగిరి అనే వ్యక్తి వైద్యం కోసం రూ.3లక్షల విలువ చేసే ఎల్‌వోసీని వారి కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని నిరుపేదల వైద్యానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుందా అశోక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రవీన్‌రెడ్డి, మాదారం సర్పంచ్‌ రాములు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ ఈశ్వరయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST