కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వ సంస్థలు ధారాదత్తం

ABN , First Publish Date - 2021-05-02T05:34:07+05:30 IST

కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వ సంస్థలు ధారాదత్తం

కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వ సంస్థలు ధారాదత్తం

వికారాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నాయని టీఎ్‌సయూటీఎఫ్‌ స్టడీసర్కిల్‌ మోడరేటర్‌ వై.రవి ఆరోపించారు. శనివారం టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా స్టడీసర్కిల్‌లో ‘‘భారతదేశంలో ప్రైవేటీకరణ అమలు-దాని ప్రభావాలు’’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను రోజురోజుకు నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వానికి లాభాలు చేకూర్చే ప్రైవేటు రంగ కార్పొరేట్‌ దిగ్గజాల ఆస్తులను పెంచడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం, జిల్లా కార్యదర్శి బాబురావు, నవాబుపేట అధ్యక్షుడు రాములు, శేరిలింగంపల్లి అధ్యక్షుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-02T05:34:07+05:30 IST