గోలి శ్రీనివాస్‌రెడ్డికి అధిష్టానం బుజ్జగింపు

ABN , First Publish Date - 2021-11-24T04:39:29+05:30 IST

గోలి శ్రీనివాస్‌రెడ్డికి అధిష్టానం బుజ్జగింపు

గోలి శ్రీనివాస్‌రెడ్డికి అధిష్టానం బుజ్జగింపు

ఆమనగల్లు: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డిని పార్టీ అధిష్టానం బుజ్జగించింది. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న గోలికి నిరాశే ఎదురైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు సిట్టింగ్‌ లైన కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డిలకే రెండో సారి అవకాశం కల్పించారు. దీంతో గోలి శ్రీనివా్‌సరెడ్డితో పాటు ఆయన వర్గీయులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెంచుకున్న ఆయన చాలా కాలంగా మంత్రి కేటీఆర్‌తో పాటు, సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఆశించినప్పటికీ రాజకీయ సమీకరణలు, అప్పటి పరిస్థితుల దృష్ట్యా శ్రీనివా్‌సరెడ్డికి అవకాశం లభించలేదు. ఇదివరకే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని గోలిపై కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు పలువురు ఇతర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ఓటర్లు ఆయనపై ఒత్తిడి పెంచారు. హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ నివాసానికి సైతం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి గోలిశ్రీనివా్‌సరెడ్డితో పాటు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతలు వెళ్లి తమ మనస్సులో మాట చెప్పారు. గోలికి అవకాశం కల్పించాలని కోరిన అధిష్టానం కసిరెడ్డి నారాయణరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందని పార్టీ అధిష్టానానికి అందరూ కట్టుబడి పనిచేయాలని కోరుతూ గోలికి న్యాయం జరుగుతుందని తెలిపారు. అక్కడి నుంచి మంత్రి హరీశ్‌రావు ఇంటికి శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే, గోలి, ఆయన అనుచరులు వెళ్లారు. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి కార్పోరేషన్‌ చైర్మన్‌గా అవకాశం కల్పిస్తామని హరీశ్‌రావు హామీఇచ్చి గోలిని బుజ్జగించారు. దీంతో మెత్తబడ్డ శ్రీనివా్‌సరెడ్డి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉందామంటూ అనుచరులకు నచ్చజెప్పారు. 

Updated Date - 2021-11-24T04:39:29+05:30 IST