మహిళా రైతు మెడలో గొలుసు చోరీ

ABN , First Publish Date - 2021-01-13T05:51:40+05:30 IST

మహిళా రైతు మెడలో గొలుసు చోరీ

మహిళా రైతు మెడలో గొలుసు చోరీ

కీసర: వ్యవసాయ పనుల్లో ఉన్న మహిళా రైతు మెడలో బంగారు గొలుసు గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్లిన సంఘటన మంగళవారం కీసర మండలం గోధుమకుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోధుమకుంటకు చెందిన వంగేటి పెంటమ్మ(72) తన పొలం వద్ద పనుల్లో నిమగ్నమైంది. ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి పెంటమ్మతో మాట్లాడుతూ సమీపంలోనే తమ బంధువుల భూమి ఉందంటూ మాటల్లోకి దింపాడు. మాట్లాడుతుండగానే ఆమె మెడలోని 3తులాల బంగారు గొలుసు తెంపుకొని ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. పెంటమ్మ విలపిస్తూ గ్రామస్థులకు, కుటుంబీకులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్‌గౌడ్‌ తెలిపారు.


తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు

మేడ్చల్‌: మేడ్చల్‌లోని సూర్యనగర్‌ కాలనీలో సోమవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఆరిళ్లలో చోరీకి పాల్పడ్డారు. పండుగకు ఊరెళ్లిన వారి ఇళ్లను దొంగలు టార్గెట్‌గా చేసుకున్నారు. ఇళ్లలో చొరబడి వస్తువులను చిందరవందర చేసి ఇళ్లల్లో బంగారు, వెండి వస్తువులు అపహరించినట్టు తెలిసింది. యజమానులు అందుబాటులో లేకపోవడంతో ఏం ఎత్తుకపోయారో స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-13T05:51:40+05:30 IST