ఘనంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి
ABN , First Publish Date - 2021-07-09T04:27:42+05:30 IST
ఘనంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి

- విగ్రహాలు, చిత్రపటాలకు నాయకుల నివాళి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నేతలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. రాజశేఖర్‌రెడ్డి సేవలు అమోఘమని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చల్లా బాల్‌రెడ్డి, శ్రీశైలం, దేవగోని కృష్ణ, వెంకటే్‌షగౌడ్, శ్రీనివా్‌సరెడ్డి, రాజు, భాస్కర్, సుభా్‌షరెడ్డి, మామిడిపల్లి టిల్లు, తుమ్మల నవీన్, అఖిల్, మల్లెల ప్రభాకర్‌రెడ్డి, చల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయసాధనకు కృషి
షాద్‌నగర్‌అర్బన్/ఆమనగల్లు/కడ్తాల్/యాచారం/ఇబ్రహీం పట్నం రూరల్/కేశంపేట: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని షాద్‌నగర్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో వైఎ్‌సఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాబర్‌ఖాన్, బాల్‌రాజ్‌గౌడ్, ఆశన్నగౌడ్, కృష్ణారెడ్డి, శ్రీశైలం, అందె మోహన్, ముబారక్, ఖదీర్, పుల్లారెడ్డి, జితేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే వైఎ్‌సఆర్ తెలంగాణ పార్టీ జిల్లా సన్నాహక కమిటీ కన్వీర్ బొబ్బిలి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రమాదేవి, శ్రీను, పత్తి సంతోష్, శ్రీనివా్‌సరెడ్డి, వంశీరెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎ్‌సఆర్ టీపీ నాయకుడు మహమ్మద్ ఇబ్రహీం ఆధ్వరంలో వైఎ్‌సఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 72వ జయంతిని ఆమనగల్లు పట్టణంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. బస్టాండ్ ఎదుట రాజీవ్ చౌక్ వద్ద యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేనారెడ్డి హాజరై వైఎ్‌సఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ ఆశయ సాధనకు కాంగ్రెస్ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గోపి, గణేశ్, లక్ష్మీకృష్ణనాయక్, అనిల్, అలీమ్, నాయకులు వస్పుల శ్రీశైలం, సురేశ్‌నాయక్, మహేశ్, చంద్రకాంత్‌రెడ్డి, ఖలీల్, వస్పుల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. కడ్తాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు యాట నర్సింహ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు జహంగీర్‌బాబా, నాయకులు బీచ్యానాయక్, గురిగళ్ల లక్ష్మయ్య, మాలెమల్లేశ్‌గౌడ్, రాంచందర్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు. యాచారం మండల గున్‌గల్‌లో వైఎస్సాఆర్‌సీపీ నాయకులు గురువారం వైఎ్‌సఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో జంగయ్యగౌడ్, జయరాం తదితరులున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయసాధనకు కృషి చేయాలని వైఎ్‌సఆర్ తెలంగాణ పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సన్నాహక కమిటీ సభ్యుడు మాదగోని జంగయ్యగౌడ్ అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండల పరిధి ముక్కునూరు గ్రామంలో నాయకులు గోరెంకల నందకుమార్ ఆధ్వర్యంలో వైఎ్‌సఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉడుగుల భాస్కర్‌గౌడ్,నేనావత్ శ్రీనివాస్, డొంకని కుమార్, జోగు సంజయ్‌బాబు, పుట్ట సత్తయ్య, సునీల్, పాశం అనిల్‌గౌడ్ పాల్గొన్నారు. కేశంపేట మండల కేంద్రం కాకునూర్ చౌరస్తాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జగదీశ్వర్, విరేశ్, రమేష్, విజయ్‌రెడ్డి, పెంటయ్య, భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గిరిధర్‌యాదవ్, రూప్లానాయక్, భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వైఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి ఆశయసాధనకు ప్రతీ కార్యకర్త ముందుకు సాగాలని పీసీసీ కార్యదర్శి జానకీరాం అన్నారు. గురువారం తుక్కుగూడ, మహేశ్వరంలో వైఎ్‌సఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో యాదయ్య, రమేష్, రాజు, రాజేందర్ పాల్గొన్నారు.