ఘనంగా వాజ్‌పేయి జయంతి

ABN , First Publish Date - 2021-12-26T05:07:47+05:30 IST

ఘనంగా వాజ్‌పేయి జయంతి

ఘనంగా వాజ్‌పేయి జయంతి
పరిగి : వాజ్‌పేయి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు

 కీసర రూరల్‌/శామీర్‌పేట/ఘట్‌కేసర్‌/పరిగి/దోమ : భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని శనివారం నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. అదేవిధంగా దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి, అహ్మద్‌గూడ, రాజీవ్‌ గృహకల్ప కాలనీల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్‌ జిల్లా మాజీప్రధాన కార్యదర్శి కందాడి సత్తిరెడ్డి, నాయకులు సురేష్‌, విక్రంసింగ్‌, బింగి రమేష్‌, జూపల్లి నరేష్‌, అక్కాల సురేష్‌, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ శామీర్‌పేట మండలాఽధ్యక్షుడు కైర యాదగిరి ఆధ్వర్యంలో మండలం పరిధిలోని అలియాబాద్‌ చౌరస్తాలో వాజ్‌పేయి చిత్రపటం ఏర్పాటుచేసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యకమ్రంలో బీజేపీ మేడ్చల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వంగరి హృదయ్‌కుమార్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు మామిళ్ల అశోక్‌, రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యవర్గ సభ్యురాలు సునీతనాయక్‌, సీనియర్‌ నాయకులు వివేకానంద, సుధాకర్‌నాయక్‌, శామీర్‌పేట మండల ప్రధాన కార్యదర్శి కె.నర్సింగ్‌రావు, ఉపాధ్యక్షుడు సొప్పరి లక్ష్మణ్‌, దేశం పవన్‌గౌడ్‌, బీజేవైఎం శామీర్‌పేట మండలాధ్యక్షుడు శరత్‌కుమార్‌, శామీర్‌పేట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇర్రి జ్యోతి, అల్లం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. వాజ్‌పేయి జయంతిని ఘట్‌కేసర్‌లో ఘనంగా జరుపుకున్నారు. బీజేపీ నాయకులు కేక్‌ కట్‌చేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యదర్శి నానావత్‌ బిక్కునాయక్‌ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో వాజ్‌పేయి ఆదర్శ నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజేయులుగౌడ్‌, కాలేరు రామోజీ, శ్రీరాములు, రఘునాథ్‌, పాండు తదితరులు పాల్గొన్నారు. అదేవిధగా పరిగిలో బీజేపీ నాయకులు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్‌, కార్యదర్శి హరికృష్ణ, మండలాధ్యక్షుడు ఆంజనేయులు, పట్టణాధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు  పెంటయ్యగుప్త, వాణిశ్రీ, ప్రేమ్‌కుమార్‌, మహదేవ్‌చారి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దోమ ప్రధాన చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. అటల్‌జీ చేసిన సేవలు దేశ ప్రజలు ఏనాటికీ మచిరిపోలేరని అన్నారు. ఆయన ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, జిల్లా, మండల నాయకులు బాల్‌రాజ్‌, భాస్కర్‌, నర్సింహులు, మహేశ్‌గౌడ్‌, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T05:07:47+05:30 IST