ఘనంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-02-06T04:18:44+05:30 IST

ఘనంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు
పరిగి: కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్‌ కట్‌చేస్తున్న మహేశ్‌రెడ్డి

  • రక్తదాన శిబిరాల ఏర్పాటు 
  • ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ 
  • ఎమ్మెల్యే దంపతులకు సన్మానం


పరిగి: పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి 48వ జన్మదిన వేడుకలను శుక్రవారం పరిగిలోని ఆయన స్వగృహంలో కుటుంబసభ్యులు, కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. పరిగి, దోమ మండల కేంద్రాల్లో రక్తదానశిభిరాలు నిర్వహించారు. 150మంది యువకులు రక్తదానం చేశారు. పరిగి, కులకచర్ల, దోమ ఆసుపత్రుల్లో  ఎమ్మెల్యే సతీమణి ప్రతీమారెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో కార్యకర్తల ఎమ్మెల్యేతో కేక్‌ కట్‌ చేయించారు. మెయిన్‌ రహదారిలో ఎస్‌.భాస్కర్‌ చేయించిన పెద్ద పూలమాల క్రేన్‌ సహాయంతో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే తల్లిదండ్రులు హరీశ్వర్‌రెడ్డి, గిరిజాదేవిలు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, పరిగి జడ్పీటీసీ హరిప్రియాప్రవీణ్‌రెడ్డి, ఎంపీపీ కె.అరవింద్‌రావు, మాజీ జడ్పీటీసీ మీరుమహమూద్‌అలీ, మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, నార్మాక్స్‌ డైరెక్టర్లు బి.ప్రవీణ్‌రెడ్డి, పి.వెంకట్‌రాంరెడ్డి, పీఏసీఎస్‌ వైఎస్‌ చైర్మన్‌ భాస్కర్‌, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌వర్ధన్‌రెడ్డి, నాయకులు అనిల్‌రెడ్డి, సురేందర్‌, హైమద్‌బలాల, కౌన్సిలర్లు రవీంద్ర, కృష్ణ పాల్గొన్నారు. 


నూతన కమిటీకి అభినందన

కొడంగల్‌:  కొడంగల్‌లో జిల్లా అర్చక సంఘం నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి నూతన కమిటీని అభినందించారు. అనంతరం అర్చక సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులుగా చంద్రకాంత్‌రావు, జిల్లా అధ్యక్షులుగా జయతీర్థచారి, ఉపాధ్యక్షులుగా సంగమేశ్వర్‌స్వామి, ప్రధాన కార్యదర్శిగా నందకిషోర్‌, కోశాధికారిగా అఖిలేశ్వర్‌, శ్రీకాంతచారి, పార్వతయ్య, దత్తాత్రేయరావు, జగదీశ్వర్‌, రామస్వామి తదితరులను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. 


అనంత పద్మనాభుడిని  దర్శించుకున్న ఎమ్మెల్యే

వికారాబాద్‌:వికారాబాద్‌ పరిధిలోని అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామిని శుక్రవారం పరిగి ఎమ్మెల్యే మహే్‌షరెడ్డి జన్మదిన సందర్భంగా సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారి కల్యాణం, ప్రత్యేక పూజలు, శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అంతకు ముందు ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

Updated Date - 2021-02-06T04:18:44+05:30 IST