ఘనంగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2021-08-26T04:21:43+05:30 IST
ఘనంగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ జన్మదిన వేడుకలు

ఆమనగలు/కడ్తాల్/తలకొండపల్లి/మాడ్గుల: కల్వకుర్తిఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండల కేంద్రాల్లో బుధవారం టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడ్తాల, ఆమనగల్లులో భారీ ర్యాలీ చేపట్టారు. టీఆర్‌ఎస్ మహిళా కార్యదర్శి చలికంటి ఆదిలక్ష్మి, పార్టీ శ్రేణులు, తన తల్లి మంగమ్మతో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నాయకులు, కార్యకర్తలు బాణా సంచా కాల్చి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎ్‌స్ నాయకులు గంప వెంకటేశ్, తోట గిరియాదవ్, పోనుగోటి అర్జున్‌రావు, జర్పుల దశరథ్‌నాయక్, గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, బాచిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, కంబాల పరమేశ్, జక్కు అనంత్‌రెడ్డి, జోగు వీరయ్య, లచ్చిరామ్‌నాయక్, బొప్పిడి గోపాల్, ముజుబుర్ రెహమాన్, గంప శ్రీను, అనురాధపత్యనాయక్, అప్పం శ్రీను, నిట్ట నారాయణ, సీఎల్ శ్రీనివాస్ యాదవ్, నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, దశరథ్‌నాయక్, స్వప్న భాస్కర్‌రెడ్డి, జగన్‌రెడ్డి, సోనశ్రీను నాయక్, సరితపంతూనాయక్, దోనాదుల కుమార్, సయ్యద్ ఖలీల్, వెంకటయ్య, అంజి, కమటం వెంకటయ్య, గుత్తి బాలస్వామి, రూపం వెంకట్‌రెడ్డి, శంకర్ పాల్గొన్నారు. మాడ్గుల మండలంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.