బాలికలు కరాటే శిక్షణ పొందాలి

ABN , First Publish Date - 2021-12-27T05:13:20+05:30 IST

బాలికలు కరాటే శిక్షణ పొందాలి

బాలికలు కరాటే శిక్షణ పొందాలి
సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థులు

ఇబ్రహీంపట్నం: మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని, ఈ తరుణంలో స్వీయ రక్షణకు బాలికలు ప్రతి ఒక్కరూ కరాటేలో శిక్షణ పొందాలని విక్టరీ షాటోకాన్‌ కరాటే వ్యవస్థాపకులు మల్లిఖార్జున్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నంలోని మార్కెట్‌ యార్డు ఆవరణలో మాస్టర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్‌ గ్రేడింగ్‌ టెస్టు నిర్వహించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు వారు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. మాస్టర్ల్లు వెంకటేష్‌, అశోక్‌, సంజయ్‌, కిషోర్‌, రాజశేఖర్‌, మునీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T05:13:20+05:30 IST