విలువైన వస్తువులను భద్రపర్చుకోండి

ABN , First Publish Date - 2021-01-14T03:28:56+05:30 IST

విలువైన వస్తువులను భద్రపర్చుకోండి

విలువైన వస్తువులను భద్రపర్చుకోండి

 ఘట్‌కేసర్‌ సీఐ చంద్రబాబు

ఘట్‌కేసర్‌ రూరల్‌ : సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు సూ చించారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఊళ్లకు వెళ్లేవారు తమ ఇళ్లలో విలువైన వస్తువులను ఉంచరాదని, బం గారు ఆభరణాలను బ్యాంక్‌ లాకర్లలో భద్రపరుచుకోవాలని అన్నారు. ఇం టి తలుపులకు సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా వెంట తీసుకెళ్లాలన్నారు. పక్కింటి వారికి, పోలీసుస్టేషన్‌లో ఊరు వెళ్లే విషయాన్ని తెలపాలన్నారు. ఎక్కువ రోజులు ఊరికి వెళ్తే పాలవాణ్ని, పేపర్‌ బాయ్‌ని రావొద్దని చెప్పాలని, కొత్తవ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Updated Date - 2021-01-14T03:28:56+05:30 IST