యూనిక్‌ ఐడీ కార్డులతో సేవలు పొందండి

ABN , First Publish Date - 2021-06-22T04:17:26+05:30 IST

యూనిక్‌ ఐడీ కార్డులతో సేవలు పొందండి

యూనిక్‌ ఐడీ కార్డులతో సేవలు పొందండి
వికలాంగులకు యూనిక్‌ ఐడీ కార్డులు అందజేస్తున్న ఎమ్మెల్యే

  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 

ఇబ్రహీంపట్నం: యూనిక్‌ ఐడెంటిటీ కార్డులతో వికలాంగులు పలు రకాలుగా సేవలు పొందవచ్చని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికలాంగులకు వైకల్య గుర్తింపు కార్డు (యూనిక్‌ డిజబుల్టీ ఐడెంటిటీ కార్డు)లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్డులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా చెల్లుబాటవుతాయని బస్సులు, రైళ్లలో ప్రయాణానికి రిజర్వేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. అంతేగాక ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు, విద్యా సంస్థల్లో వికలాంగుల కోటా పొందడానికి వీలుంటుందన్నారు. నియోజకవర్గంలో 4627 ఐడీ కార్డులు రావాల్సి ఉందని కార్డులు రానివారు ప్రత్యేక లింకు ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సీడీపీవో జి.శాంతిశ్రీ, సూపర్‌వైజర్లు పద్మ తదితరులున్నారు.

Updated Date - 2021-06-22T04:17:26+05:30 IST