ఉచితంగా న్యాయం పొందండి

ABN , First Publish Date - 2021-11-10T05:23:47+05:30 IST

ఉచితంగా న్యాయం పొందండి

ఉచితంగా న్యాయం పొందండి
ఇబ్రహీంపట్నం: ర్యాలీలో పాల్గొన్న జడ్జీలు ఇందిర, రాజు, అనామిక

ఇబ్రహీంపట్నం: పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఉచిత న్యాయం పొందడం కూడా ఒక హక్కు అని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం సీనియర్‌ సివిల్‌ జడ్జి ఇందర అన్నారు. నవంబర్‌ 9 జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోర్టు ప్రాంగణం నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు న్యాయవాదులు, పోలీసులు, విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కోర్టు ఆవరణలో ఆమె మాట్లాడారు. కేసుల్లో రాజీపడి సత్వర న్యాయం పొందితే సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. అక్టోబర్‌ రెండు నుంచి నవంబర్‌ 14 వరకు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో చట్టాలపై అవగాహన, ఉచిత న్యాయం పొందే విధానాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. జూనియర్‌ జడ్జీలు రాజు, అనామిక, బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివా్‌సకుమార్‌, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్‌, అడ్వకేట్లు ఎం.శ్రీనివా్‌సరెడ్డి, మాదన్న, అంజన్‌రెడ్డి, మహేందర్‌, రవికిరణ్‌ పాల్గొన్నారు.


  • ‘సింబియాసి్‌స’లో మ్యూట్‌ కోర్టు 


నందిగామ: నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని మహబూబ్‌నగర్‌ జిల్లా లీగల్‌ అథారిటీ సీనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి అన్నారు. నందిగామ మండలం మొదళ్లగూడ శివారులోని సింబియాసిస్‌ లా కాలేజీలో విద్యార్థులకు మ్యూట్‌ కోర్టు కాంపిటేషన్‌ నిర్వహించారు. విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి పలు చట్టాలపై వాదనలు, ప్రతి వాదనలు వినిపించారు. అనంతరం విద్యార్థులకు క్రిమినల్‌ చట్టాలపై జడ్జి సంధ్యారాణి అవగాహన కల్పించారు. షాద్‌నగర్‌ బార్‌అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ వేణుగోపాల్‌, న్యాయవాదులు అంజనేయులుగౌడ్‌, శ్రీనివాసమూర్తి, కళాశాల డైరక్టర్‌ అనురాధ, అధ్యాపకులు శాంతి, హజీ, అనిత సబ్లె పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-10T05:23:47+05:30 IST