రోడ్ల విస్తరణకు నిధులిప్పించండి

ABN , First Publish Date - 2021-12-08T05:45:16+05:30 IST

రోడ్ల విస్తరణకు నిధులిప్పించండి

రోడ్ల విస్తరణకు నిధులిప్పించండి
మంత్రి కిషన్‌రెడ్డితో శ్రీవర్దన్‌రెడ్డి

షాద్‌నగర్‌అర్బన్‌: షాద్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధి కోసం సీఆర్‌ఎఫ్‌ నిధులు ఇప్పించాలని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని కోరినట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్‌.శ్రీవర్దన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో మంత్రిని కలిసి పలు విషయాలను చర్చించినట్లు ఆయన తెలిపారు. షాద్‌నగర్‌ నుంచి ఆమనగల్లు, షాద్‌నగర్‌ నుంచి పరిగి వరకు ఉన్న రోడ్ల విస్తరణ కోసం నిధులు మంజూరు చేయించాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర రోడ్లు, భవనాలశాఖమంత్రి నితిన్‌ గడ్కరీతో మాట్లాడి నిధులు మంజూరు చేయించడానికి కృషిచేస్తానని మంత్రి తెలిపారు. అదేవిధంగా జిల్లా రాజకీయాల గురించి చర్చించినట్లు శ్రీవర్దన్‌రెడ్డి వివరించారు.

Updated Date - 2021-12-08T05:45:16+05:30 IST