క్రీడలతో స్నేహభావం

ABN , First Publish Date - 2021-03-22T05:35:43+05:30 IST

క్రీడలతో స్నేహభావం

క్రీడలతో స్నేహభావం
క్రికెట్‌ టోర్నీ ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌

  • జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి


బషీరాబాద్‌: క్రీడలతో యువతమధ్య స్నేహభావం పెంపొందుతుందని వికారాబాద్‌ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి  అన్నారు. బషీరాబాద్‌లో ఆదివారం పట్నం మహేందర్‌రెడ్డి క్రికెట్‌ టోర్నమెంట్‌ను అమె ప్రారంభించారు. ఈసందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహిస్తే మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఆటల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు. ఎంపీపీ కరుణఅజయ్‌ ప్రసాద్‌, జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, వైస్‌చైర్మన్‌ జడల అన్నపూర్ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎ.వెంకట్‌రాంరెడ్డి, సర్పంచ్‌ ప్రియాంక, ఎంపీటీసీ రేఖపవాన్‌ఠాగూర్‌, ఆర్గనైజర్‌ రియాజ్‌ పాల్గొన్నారు.


శుభకార్యానికి హాజరైన జడ్పీ చైర్‌పర్సన్‌

తాండూరు: యాలాల మండలం టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కరణం పురుషోత్తంరావు ఇంట్లో ఆదివారం జరిగిన ఓ శుభకార్యానికి జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించారు. చైర్‌పర్సన్‌ వెంట పలువురు నాయకులు ఉన్నారు.

Updated Date - 2021-03-22T05:35:43+05:30 IST