ఫ్రీడమ్ రన్..
ABN , First Publish Date - 2021-03-25T04:22:10+05:30 IST
ఫ్రీడమ్ రన్..

వికారాబాద్ : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి కావస్తున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 75 వారాల పాటు అమృత మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పౌసుమిబసు పేర్కొన్నారు. మొదటి వారంలో భాగంగా బుధవారం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఎన్నెపల్లి నుంచి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం వరకు 2కిలో మీటర్ల ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, ఏఎస్పీలు పాల్గొని జెండా ఊపీ రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు సంవత్సరం పాటు ప్రతి వారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగష్టు 2022 వరకు అన్ని శాఖల అధికారులు దేశ అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పరుగులో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారికి మొమెంటోలు అందజేశారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, అదనపు ఎస్పీ రషీద్, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, డీవైఎస్‌వో హన్మంత్‌రావు, డీటీడీవో కోటాజీ, డీఏవో గోపాల్, ఏవో హరిత, తహసీల్దార్ సుధ, బాబుమోజెస్, భోగేశ్వర్లు, రమేష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.