మహిళల అభివృద్ధికి చేయూత

ABN , First Publish Date - 2021-03-22T05:57:59+05:30 IST

మహిళల అభివృద్ధికి చేయూత

మహిళల అభివృద్ధికి చేయూత
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
  • ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 
  • హాజరైన జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి


పరిగి: మహిళలు పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో రాణించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. పూడూరు జడ్పీటీసీ ఎంపీ మేఘమాలప్రభాకర్‌గుప్తా ఆధ్వర్యంలో ఆదివారం పరిగిలోని కేఎ్‌సఆర్‌ గార్డెన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. పేద మహిళలకు కట్టుమిషన్లు, ఇతర మెటీరియల్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం తగిన చేయూతనందిస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల కోసం పుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఇతర పారిశ్రామిక అభివృద్ధికి అవసరైన నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. మహిళల విజయం వెనుక పురుషుల పాత్ర కూడా ఉంటుందన్నారు. వి-హబ్‌ ద్వారా మహిళలు ప్రారిశ్రామిక రంగాల్లో రాణించేందుకు ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా.. వాణీదేవి విజయం సాధించడం ఇందుకు నిదర్శనమన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి మాట్లాడుతూ చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించాలంటే, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగాల్సిన అవసరం ఉందన్నారు. పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని  రంగాల్లో రాణించాలన్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివా్‌సగుప్తా మాట్లాడుతూ ఐవీఎఫ్‌ ద్వారా మేఘమాల అందించిన సేవలు అనిర్వచనీయమన్నారు. మహిళలు ఏ కార్యక్రమం తీసుకున్నా తాము అండగా ఉంటామన్నారు. మేఘమాల మాట్లాడుతూ తాను సామాజి సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సహకారం అందిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ బి.విజయకుమార్‌, పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు మండలాల ఎంపీపీలు అరవింద్‌రావు, అనసూయ, సత్తమ్మ, మల్లెశం, జడ్పీటీసీలు బి.హరిప్రియ, కె.నాగిరెడ్డి, రాందాస్‌, కె.ప్రతీమారెడ్డి, గిరిజమ్మ, దిప్తీరెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఎస్‌.రమేశ్‌కుమార్‌; నాయకులు అనిల్‌రెడ్డి, ప్రభాకర్‌గుప్తా, వీరేశం, కిరణ్‌ పాల్గొన్నారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతీక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 

Updated Date - 2021-03-22T05:57:59+05:30 IST