బసవేశ్వరుడి అడుగుజాడల్లో నడవాలి

ABN , First Publish Date - 2021-05-15T05:15:10+05:30 IST

బసవేశ్వరుడి అడుగుజాడల్లో నడవాలి

బసవేశ్వరుడి అడుగుజాడల్లో నడవాలి
శంకర్‌పల్లిలో బసవేశ్వరుడి విగ్రహం వద్ద వీరశైవులు

చేవెళ్ల/శంకర్‌పల్లి/షాబాద్‌/షాద్‌నగర్‌: మహనీయుడు బసవేశ్వరుడు చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం చేవెళ్లలో బసవేశ్వరస్వామి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బసవేశ్వరుడు సమాజానికి చేసి సేవలతో మహాత్ముడిగా నిలిచారన్నారు. ఆయన చూపిన మార్గంలో మనం నడుచుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం బసవ జయంతిని నిర్వహించడం ఆభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్‌ఎంపీపీ శివప్రసాద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఎంటీసీలు వసంతం, రాములు, సర్పంచ్‌ శైలజాఆగిరెడ్డి, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, వీరశైవ సంఘం గౌరవాధ్యక్షులు ప్రభులింగం, శివానందం, అధ్యక్షుడు వీరేశం, నాగేందర్‌, సంఘమేశ్వర్‌, పరమేశ్‌, భిక్షపతి, ప్రసాద్‌, ఆత్మలింగం, రమణారెడ్డి, శివకుమార్‌ పాల్గొన్నారు. కుల వ్యవస్థ నిర్మూలనకు బసవేశ్వరుడు కృషిచేశాడని శంకర్‌పల్లి మాజీ సర్పంచ్‌, వీరశైవ సమాజం గౌరవాఽధ్యక్షుడు సాత ఆత్మలింగం అన్నారు. బసవేశ్వర విగ్రహానికి నివాళులర్పించారు. వెంకటరెడ్డి, వెంకటరాంరెడ్డి, సత్యనారాయణ, గోపాల్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, చంద్రమౌళి, రవికుమార్‌, గుండసూర్యం, ఓంప్రకాశ్‌, గుండశేఖర్‌, రాజేశ్వర్‌ పాల్గొన్నారు. సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను వ్యతిరేకించిన వ్యక్తి బసవేశ్వరుడని విశ్రాంత ఉపాధ్యాయుడు ఏగూరి లింగప్ప అన్నారు. షాబాద్‌లోని శివాలయంలో శివలింగానికి పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 13వ శతాబ్దంలోనే బసవేశ్వరుడు అభినవ మండపాన్ని ఏర్పాటు చేసి స్ర్తీలు, పురుషులకు సమాన హక్కులను కల్పించేందుకు కృషిచేశాడని, హరిజనులకు ఆలయ ప్రవేశం, సహపంక్తి భోజనం ఏ ర్పాటు చేశారన్నారు. ఆ మహనీయుడు సూచించిన మార్గంలోనే నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్‌, లింగ బలిజ సమాజ నాయకులు బస్వరాజ్‌, మల్లికార్జున్‌, వీరేశ్‌ పాల్గొన్నారు.  


  • బసవజయంతి వేడుకలు 


షాద్‌నగర్‌: బసవ జయంతిని వీరశైవ లింగాయత్‌లు షాద్‌నగర్‌లో నిర్వహించారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో పట్టణ వీరశైవ లింగాయత్‌ సమాజం గౌరవాధ్యక్షుడు అగ్గనూరు బస్వం, అధ్యక్షుడు బొబ్బిలి ప్రవీణ్‌, ఉపాధ్యక్షులు గూడెళ్లి రమేశ్‌, ఆకుల వీరేశ్‌, మల్లికార్జునప్ప బసవేశ్వరుడి విగ్రహానికి పూజలు చేశారు.

Updated Date - 2021-05-15T05:15:10+05:30 IST