రైతుబంధు డబ్బు కోసం వెళ్లి.. ప్రాణం వదిలి

ABN , First Publish Date - 2021-01-21T04:51:06+05:30 IST

రైతుబంధు డబ్బు తీసుకునేందుకు బ్యాంకుకు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో

రైతుబంధు డబ్బు కోసం వెళ్లి.. ప్రాణం వదిలి
పండరి(ఫైల్‌)

తాండూరు/తాండూరురూరల్‌ : రైతుబంధు డబ్బు తీసుకునేందుకు బ్యాంకుకు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. తాండూరు మండలం సిరిగిరిపేట్‌ గ్రామానికి చెందిన రైతు కొత్తపేట పండరి(50)కి 2.07ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి సంబం ధించిన రైతుబంధు సాయం ఇటీవలే ఆయన ఖాతాలో జమయింది. ఆ డబ్బు తీసుకునేందుకు బుధవారం తాండూరు పట్టణంలోని ఎస్‌బీఐ(ఏడీబీ)కి పండరి వచ్చాడు. బ్యాంకులో క్యూలో నిల్చున్న సమయంలో తీవ్రంగా ఛాతీ నొప్పి రావడంతో బయటికి వచ్చాడు. బయటికి రాగానే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే రైతు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ రావుల రాధికాఅంబరీష్‌, ఎంపీటీసీ సుశీలావెంకటేశం, మాజీ వైస్‌ ఎంపీపీ శేఖర్‌, మాజీ సర్పంచ్‌ ఎల్లప్ప, నాయకులు మంత్రి నర్సింహులు కోరారు. Updated Date - 2021-01-21T04:51:06+05:30 IST