ముగిసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉత్సవాలు
ABN , First Publish Date - 2021-05-05T05:57:25+05:30 IST
ముగిసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉత్సవాలు

కడ్తాల్ : మండల పరిధిలోని రావిచెడ్ హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభ, నవగ్రహ, శివనంది విగ్రహ, నాభిశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా ముగిశాయి. మూడు రోజులపాటు ఆయా కార్యక్రమాలు కొవిడ్-19 నిబందనలను అనుసరించి భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు చిదంబర శర్మ, రామానుజాచార్యుల ఆధ్వర్యంలో హోమాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి బొప్పిడి గోపాల్, సర్పంచ్ భారతమ్మ విఠలయ్యగౌడ్, ఉపసర్పంచ్ వెంకటేశ్‌ల ఆధ్వర్యంలో భక్తులకు వసతులు ఏర్పాటు చేశారు. వేడుకల్లో ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్, జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్‌లు పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మహేందర్‌రెడ్డి, రంగయ్య, బాలకృష్ణ, డాక్టర్ శ్రీను, లింగం, కాంటేకార్ సాయి, రామోజీ, మహిపాల్‌రెడ్డి, పెంటాజీ, బొప్పిడి సత్తయ్య, మారెపల్లి రాఘవులు, భిక్షపతి, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.