ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించిన వారికి జరిమానా

ABN , First Publish Date - 2021-10-26T05:00:25+05:30 IST

ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించిన వారికి జరిమానా

ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించిన వారికి జరిమానా

కీసర రూరల్‌: నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్‌ వినియోగించిన వారిపై దమ్మాయిగూడ మున్సిపల్‌ అధికారులు విరుచుకుపడ్డారు. సోమవారం స్వచ్ఛ సర్వేక్షన్‌-2021లో భాగంగా కమిషనర్‌ స్వామి సిబ్బందితో కలిసి దుకాణాల్లో  తనిఖీలు నిర్వహించారు. తక్కువ మందం కలిగిన కవర్లను వినియోగించిన వారికి జరిమానా విధించారు. చికెన్‌, కిరాణ తదితర దుకాణదారులకు రూ.26వేల జరిమనా విధించారు. మేనేజర్‌ రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:00:25+05:30 IST