హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి తరలిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు

ABN , First Publish Date - 2021-10-07T05:30:00+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి తరలిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి తరలిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు

బంట్వారం (కోట్‌పల్లి)/కులకచర్ల : హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలో నామినేషన్‌ వేయడానికి పరిగి నియోజకవర్గం నుంచి ఫీల్డ్‌అసిస్టెంట్లు గురువారం బయలుదేరి వెళ్లారు. పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల మండలాల పరిధిలో  ఇద్దరు చొప్పున నామినేషన్లు వేస్తున్నారు. కులకచర్ల నుంచి వెంకటయ్య, భీమయ్య నామినేషన్‌ వేస్తున్నారు. ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల నుంచి తొలిగింపునకు నిరసనగా నామినేషన్‌ వేస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటయ్య తెలిపారు. వికారాబాద్‌ నుంచి 36 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్‌ వేస్తున్నట్లు తెలిపారు. అలాగే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమైనట్లు బంట్వారం, కోట్‌పల్లి మండలాల క్షేత్ర సహాయకులు(ఎ్‌ఫఏ) పేర్కొన్నారు. గురువారం వికారాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో డిక్లరేషన్‌ పత్రాలతో నిరసన వ్యక్తం చేశారు. బంట్వారం మండలం నుంచి ఈడ్గి సుభా్‌షగౌడ్‌, ఏసురత్నం, వెంకటయ్య, కోట్‌పల్లి మండలం నుంచి రాంచంద్రయ్య, వెంకట్‌లు పోటీ చేయనున్నట్లు వారు తెలిపారు.

Updated Date - 2021-10-07T05:30:00+05:30 IST