పండుగలా ముక్కోటి వృక్షార్చన
ABN , First Publish Date - 2021-07-25T05:25:04+05:30 IST
పండుగలా ముక్కోటి వృక్షార్చన

పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా
శంషాబాద్ రూరల్/షాద్‌నగర్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం పలువురు ప్రముఖులు ముక్కోటి వృక్షార్చన పండుగలా నిర్వహించారు. శంషాబాద్ మండలం పెద్దతూప్రలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రకృతివనంలో మొక్కలు నాటారు.
పట్టు పరిశ్రమ సందర్శన
షాద్‌నగర్ శివారు లింగారెడ్డిగూడలో పట్టుపరిశ్రమను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా, కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ సందర్శించారు. పట్టుపరిశ్రమ రైతులతో మాట్లాడారు. అదేవిధంగా కొండన్నగూడ గ్రామంలో మల్బరీ తోటలను పరిశీలించారు.