అంబులెన్స్‌లో మహిళ ప్రసవం
ABN , First Publish Date - 2021-09-04T05:11:12+05:30 IST
అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

బషీరాబాద్: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా శుక్రవారం సాయంత్రం అంబులెన్స్‌లో ప్రసవమైంది. మండలంలోని హంక్యానాయక్‌తండాకు చెందిన గర్భిణి బుజ్జిబాయిని అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా తండాగేటు వద్ద పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో 108అంబులెన్స్ పైలట్ దేవయ్య వాహనం పక్కన నిలిపివేశారు. మహిళ అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బషీరాబాద్ పీహెచ్‌సీకి వైద్యపరీక్షల నిమిత్తం తరలించారు.