కృత్రిమ గర్భధారణతో ఆడదూడలను వృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2021-10-30T04:24:57+05:30 IST

కృత్రిమ గర్భధారణతో ఆడదూడలను వృద్ధి చేయాలి

కృత్రిమ గర్భధారణతో ఆడదూడలను వృద్ధి చేయాలి
చిలుకూరులో గోశాలను పరిశీలిస్తున్న అధికారి మంజులావాణి

  • పశుగణాభివృద్ధి సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మంజులావాణి

మొయినాబాద్‌: కృత్రిమ గర్భధారణతో 90 శాతం ఆడదూడలు పుట్టేలా చమన్‌(వీర్యకణాలు)ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మంజులావాణి పేర్కొన్నారు. శుక్రవారం, మొయినాబాద్‌ మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అనంతరం చిలుకూరు బాలాజీ దేవాలయంలోని గోశాలను సందర్శించి కృతిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడలను పరిశీలించారు. ఈ సందర్భంగా కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడలు ఆరోగ్యంగా ఉన్నాయా? అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గోలాపమిత్రలు ఎలా పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆమెవెంట వెటర్నరీ అసిస్టెంట్‌ డైరెక్టర్లు శ్రవణ్‌కుమార్‌, బిజియాదేవి, దేవేందర్‌, మండల పశువైద్యాధికారి శ్రీలత, గోలాలమిత్ర బాలకృష్ణ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-10-30T04:24:57+05:30 IST