సంపులో పడి రైతు..
ABN , First Publish Date - 2021-12-10T04:51:37+05:30 IST
సంపులో పడి రైతు..

కొందుర్గు: సంపులో పడి ఓ రైతు మృతిచెందిన సంఘటన గురువారం సాయంత్రం మండలంలోని పర్వతాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన చాకలిరాజు(35) అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం తన ఇంట్లో నుంచి రోడ్డువైపు వెళ్తుండగా సమీపంలోని ఓఇంటి ఎదుట గల సంపుపై మూత లేకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. సంపు నీటిని వాడుకుంటున్న వ్యక్తి నీరు ఆగిపోవడంతో మోటారును నిలిపేందుకు సంపువద్దకు వెళ్లాడు. అందులో రాజు మృతదేహం కనిపించడంతో స్థానికులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్యలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.