గుప్తనిధుల కోసం తవ్వకాలు

ABN , First Publish Date - 2021-11-24T04:41:40+05:30 IST

గుప్తనిధుల కోసం తవ్వకాలు

గుప్తనిధుల కోసం తవ్వకాలు
నిధుల కోసం తవ్వకాలు జరిపిన ప్రాంతం

ఆమనగల్లు: గుప్త నిధుల కోసం ఆలయం వద్ద తవ్వకాలు జరిపిన సంఘటన మండలంలోని రాంనుంతల గేటు సమీపంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద మంగళవారం వెలుగుచూసింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం ఎదుట, సమీపంలో కంప్రెషర్‌, జేసీబీ సాయంతో డ్రిల్లింగ్‌ చేసి రాళ్లను తొలగించారు. పలు చోట్ల గోతులు తీశారు. దీంతో స్థానిక సర్పంచ్‌ సోన శ్రీను నాయక్‌, ఎంపీటీసీ సరితపంతూనాయక్‌, స్థానిక నాయకులు తవ్వకాలను పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలయాన్ని కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - 2021-11-24T04:41:40+05:30 IST