ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2021-11-21T05:45:00+05:30 IST
ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలి

యాచారం/చౌదరిగూడ/ఆమనగల్లు: ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ అన్నారు. నందివనపర్తిలో శనివారం నిర్వహించిన శ్రీకంఠమేశ్వరస్వామి విగ్రహప్రతిష్ఠలో వారు పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఓనిరుపేద వివాహం జరుగుతుందని తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉదయశ్రీ, బి.శేఖర్‌రెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి. కె.జోగిరెడ్డి. లక్ష్మీపతిగౌడ్, తాళ్ల మహేష్‌గౌడ్ తదితరులున్నారు. అదేవిధంగా చౌదరిగూడ మండల పరిధిలోని లాల్‌పహాడ్ చౌరస్తాలో నిర్మించిన శ్రీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం జరిగాయి. ధ్వజారోహనం, సర్వదేవత ఆహ్వానం, విశ్వక్సేన పూజలను పూజారి వంశీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో వైభంగా నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త పలబట్ల పాండురంగం పాల్గొని ధ్వజస్తంభ ఇత్తడి తొడుగుకు రూ.లక్షా 11వేలు ఆలయట్రస్టుకు విరాళంగా అందజేశారు. ఆలయ ట్రస్టు చైర్మన్ మచ్చ సుధాకర్‌రావు ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పరిధిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నిరాయణరెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండల కేంద్రంలో నిర్వహించే పడిపూజ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నాయకులు రమేశ్ యాదవ్, వెంకటేశ్, బాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సురేందర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, హనుమ నాయక్ పాల్గొన్నారు.
బుగ్గజాతరకు కొనసాగుతున్న భక్తుల రద్దీ
మంచాల: బుగ్గజాతర ఉత్సవాలకు భక్తుల రద్దీకొనసాగుతోంది. రెండో రోజు శనివారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీకస్నానాలు ఆచరించి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం కుటుంబసమేతంగా వనభోజనాలు చేసి సాయంత్రానికి స్వస్థలాలకు తిరిగివెళ్లారు. కాగా మొదటిరోజు అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఈరద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్సవకమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా నీటివసతి, పార్కింగ్, స్వామివారి దర్శనం, వ్రతాలు, ప్రత్యేకపూజలు, కార్తీక దీపాల స్థలం తదితర ఏర్పాట్లకోసం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఉత్సవాలు మరో 13 రోజులు జరుగుతాయని సర్పంచ్ కొంగరవిష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.