చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2021-10-29T05:10:00+05:30 IST
చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

కొడంగల్‌రూరల్: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కొడంగల్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ అన్నారు. మండలంలోని హస్నాబాద్, ఆలేడ్, పాతకొడంగల్, పలుగురాళ్లతండా, ఎక్కచెరువు తండాల్లో ఆజాదికా అమ్రిత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం విద్యార్థులు గ్రామస్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, బి.వెంకటయ్య, ప్రభాకర్, డి.నర్సిములు, బస్వరాజ్, కే.రమేశ్, భీములు, శ్రీనివాస్, ఆనంద్, శకనప్ప తదితరులు వివిధ చట్టాలపై వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పకీరప్ప, ఎస్సై మహిపాల్‌రెడ్డి, ఏఎస్సై బాలకృష్ణ, పోలీసు సిబ్బంది గోపాల్ పాల్గొన్నారు.