చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-10-08T05:28:50+05:30 IST

చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
బంట్వారం : సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి

బంట్వారం/వికారాబాద్‌ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌ లావణ్యశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ కళాబృందంచే సమాజంలో జరుగుతున్న అక్రమాలు అరికట్టేందుకు తీసుకోవల్సిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్‌, ఎంపీటీసీలు పద్మవెంకటేష్‌, శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచులు నరసింహారెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర, జిల్లా న్యాయసేవా సంస్థ ఆదేశాల మేరకు పాన్‌ ఇండియా అవేర్‌నెస్‌ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్‌ 2 నుంచి నవంబర్‌ 14 వరకు గ్రామాల్లో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా కోర్టు 12వ అదనపు న్యాయమూర్తి వై.పద్మ తెలిపారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మానసిక, ఆరోగ్యానికి సంబంధించి, మానవ సంబంధాలు, ఎస్సీ, ఎస్టీ చట్టాలపై వివరించడం జరుగుతుందన్నారు. కాలేజీ విద్యార్థులకు విద్య, అలవాట్లపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమాల్లో న్యాయమూర్తులు, మండల న్యాయసేవా చైర్మన్‌, పౌర లీగల్‌ వాలంటీర్లు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొంటారని తెలియజేశారు.

Updated Date - 2021-10-08T05:28:50+05:30 IST