అధికారమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలి

ABN , First Publish Date - 2021-12-31T05:17:42+05:30 IST

అధికారమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలి

అధికారమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలి
కార్యకర్తల శిక్షణలో మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు స్వామిగౌడ్‌

మహేశ్వరం: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ప్రతీ కార్యకర్త ఏకశక్తి కేంద్రంగా పనిచేయాలని పార్టీ రాష్ట్ర నాయకుడు స్వామిగౌడ్‌ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ మండలాధ్యక్షడు మాధవాచారి అధ్యక్షతన మహేశ్వరంలో కార్యకర్తలకు రెండు రోజుల తరగతులకు స్వామిగౌడ్‌ హాజరై మాట్లాడారు. జాతీయ భావాలతో కార్యకర్తలు నాయకులుగా ఎదగాలని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలు మోదీని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో విజయంపై ముందడుగు వేయాలన్నారు. శిక్షణ తరగతుల్లో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు బొక్క నర్సింహారెడ్డి, బి.పాపయ్యగౌడ్‌, కె.జంగయ్యయాదవ్‌, అనంతయ్యగౌడ్‌, మిద్దె సుదర్శన్‌రెడ్డి, తెల్గ మల్లయాదీష్‌, నందీశ్వర్‌, యాదయ్యగౌడ్‌, కాసాని వెంకటే్‌షగౌడ్‌, సుదర్శన్‌, ప్రబాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ప్రకాశ్‌, చంద్రయ్యగౌడ్‌, కుమార్‌, దేశ్యా, ముత్యం, శ్రావణ్‌, రఘుపతిగౌడ్‌, వివిధ గ్రామాల బూత్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:17:42+05:30 IST