రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్‌కో ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2021-10-22T05:25:48+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్‌కో ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్‌కో ఉద్యోగి మృతి

ఇబ్రహీంపట్నం: నాగార్జునసాగర్‌ హైవేపై మంచాల మండ లం ఆగాపల్లి సమీప పైపుల ఫ్యాక్టరీ వద్ద బుధవారం రాత్రి ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో విద్యుత్‌ శాఖ ఉద్యోగి ఒకరు గాయపడి చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. సీఐ వెంకటేష్‌ తెలిపిన వివరాల మేరకు.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలెపల్లికి చెందిన వెంకటపేట రాజు(32) ఇబ్రహీంపట్నం ట్రాన్స్‌కో ఏఈ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో కారులో సొంతూరు వెళ్తూ ఆగాపల్లి వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని నగరంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. రాజుకు భార్య అనూష, కుమారుడు, కూతరు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


  • మంచి ఉద్యోగిని కోల్పోయాం : సిబ్బంది సంతాపం


యాచారం: ఆగాపల్లి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సహోద్యోగి రాజు మరణించడం బాధాకరం అని ట్రాన్స్‌కో ఏఈ సందీ్‌పకుమార్‌ అన్నారు. రాజు విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండేవారని, అంకితభావంగల ఉద్యోగిని కోల్పోయామన్నారు. అతడి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2021-10-22T05:25:48+05:30 IST