‘సహకార సంఘాన్ని లాభాల్లోకి తెచ్చేందుకు కృషి’

ABN , First Publish Date - 2021-03-22T05:30:00+05:30 IST

‘సహకార సంఘాన్ని లాభాల్లోకి తెచ్చేందుకు కృషి’

‘సహకార సంఘాన్ని లాభాల్లోకి తెచ్చేందుకు కృషి’
మాట్లాడుతున్న రవీందర్‌గౌడ్‌

తాండూరు రూరల్‌: తాండూరు మండల పరిధిలోని ఎల్మకన్నె సహకార సంఘాన్ని  లాభాల బాటలో తీసుకువచ్చేందుకు మరింత కృషి చేస్తానని హెచ్‌డీసీసీ బ్యాంకు డైరెక్టర్‌, ఎల్మకన్నె సహకార సంఘం చైర్మన్‌ ఎస్‌.రవీందర్‌గౌడ్‌ అన్నారు. తాండూరు మండలం ఎల్మకన్నె సహకార సంఘం కార్యాలయంలో సోమవారం డైరెక్టర్లు, సంఘసభ్యుల సమక్షంలో మహాజన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్మకన్నె సహకార సంఘం కింద రూ.9కోట్ల బంగారు తాకట్టు రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం సంఘం రూ.1కోటి 65లక్షల ఆదాయంతో కొనసాగుతుందన్నారు. వచ్చిన ఆదాయంలో 25శాతం బిల్డింగ్‌ నిర్మాణం చేపట్టేందుకు మహాజన సంఘం సమావేశంలో తీర్మానించారు. సంఘంలో రూ.3500మంది రైతులు ఉన్నారని, రూ.42లక్షల దీర్ఘకాలిక రుణాలు వసూలు చేయాల్సి ఉందని, వీరంతా త్వరలో రుణాలు చెల్లించేందుకు ముందుకు రావాలని కోరారు. తమ సహకార సంఘం ద్వారా త్వరలోనే నాబార్డు ద్వారా రైస్‌ మిల్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే సిరిగిరిపేట్‌ గ్రామ సమీపంలో రెండు ఎకరాల్లో గోదాంలు నిర్మించేందుకు రెవెన్యూ అధికారులు భూమి కేటాయించారని చెప్పారు. వచ్చే సీజన్‌కు రుణాలకోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈసమావేశంలో వైస్‌చైర్మన్‌ నర్సింహారెడ్డి, సీఈవో శ్రీనివాస్‌, అడిషనల్‌ సీఈవో చంద్రారెడ్డి, డైరెక్టర్లు సురేందర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, పార్వతమ్మ, రఘు, బిచ్చప్ప, నర్సింహులు, అమృతయ్యగౌడ్‌, నాగలింగం, అనంతమ్మ, నాయకులు మాధవరెడ్డి, శ్రీధర్‌గౌడ్‌, శామప్ప పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T05:30:00+05:30 IST